బాలీవుడ్ అగ్ర హీరో అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.అసిస్టెంట్ డైరెక్టర్ గా లగాన్ మూవీ దగ్గరనుంచి అమీర్ చేసిన చాలా సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసింది.ఆ తర్వాత 2011 లో అమీర్ ఖాన్ హీరోగానే ధోభీ ఘాట్ అనే చిత్రంతో దర్శకురాలిగా మారిన కిరణ్ రావు గత సంవత్సరం సెప్టెంబర్ లో లాపతా లేడీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతు 2025 ఆస్కార్ అవార్డుల్లో భారతదేశం తరుపున అధికార ప్రవేశానికి లాపతా లేడీస్ అర్హత సాధిస్తుందనే నమ్మకం నాకు ఉంది.ఈ సినిమా ఆస్కార్ వేదికపై మన దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది నాతో పాటు చిత్ర బృందం మొత్తం యొక్క కోరిక. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కూడా తన వంతు బాధ్యతగా ఆస్కార్ కి పంపిస్తుదనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చింది.
గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారయ్యే సంఘటనలని ఇతివృతంగా చేసుకొని లాపతా లేడీస్ తెరకెక్కగా నీతాన్షి గోయల్, ప్రతిభా రంతా, స్పర్శ్ శ్రీ వాత్సవ,రవి కిషన్, ఛాయా కదమ్ వంటి స్టార్స్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అమిర్ ఖాన్ నే ఈ మూవీని నిర్మించడం విశేషం. సుప్రీం కోర్టు డెబ్భై ఐదేళ్ల వేడుకల్లో భాగంగా కోర్టు అడ్మినిస్ట్రేట్ వేడుకల్లో లాపతా లేడీస్ ని ప్రదర్శించారు.